* 28న సదస్సును విజయవంతం చేయండి
* విద్యార్థి సంఘాల పిలుపు
ఆకేరున్యూస్, హన్మకొండ: హనుమకొండ జిల్లాలోని బాల సముద్రంలో ప్రభుత్వం నిర్మిస్తున్న కళాక్షేత్రంలో ఖచ్చితంగా కళాకారుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ పెట్టాలని డిమాండ్ చేస్తూ విద్యార్ది సంఘాల ఆధ్వర్యంలో హనుమకొండలో జరుగబోయే సదస్సును విడుదల చేయాలని విద్యార్థి నాయకులు పిలుపునిచ్చారు.దీనికి సంబంధించిన కరపత్రాలను విద్యార్థి నాయకులు అంబేడ్కర్ సెంటర్ వద్ద విడుదల చేశారు. కళాక్షేత్రంలో కళకు సంబంధం లేని వ్యక్తుల విగ్రహాలు పట్టకూడదని తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో కోసం ఆడి పాడిన కళాకారులు,తెలంగాణ కళారూపాలను కాపాడిన కళాకారులను గుర్తించి గౌరవ్చాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. గద్దర్,చుక్కా సత్తయ్య,మిద్దె రాములు,చిందు ఎల్లమ్మ,గూడ అంజయ్య,బెల్లి లలిత,సాయి చంద్,ఎర్ర ఉపాధి,వరంగల్ శంకరన్న,సారంగపాణి,నేరెళ్ల వేణుమాధవ్ వంటి ఎంతో మంది కళాకారులను గౌరవించాలని డిమాండ్ చేశారు. వంద కోట్లతో నిర్మిస్తున్న కళాక్రేత్రం కళతో సంబంధం లేని వ్యక్తుల పేర్లతో ఉండడం ఆమోదయోగ్యం కాదన్నారు. కేవలం ఆధిపత్యవర్గాలకు చెందినవారు కాబట్టే కాళోజీ విగ్రహం పెట్టడం,తెలంగాణ కళాకారులను అవమానించడమే అని అన్నారు. కళాకారులను గౌరవించకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ అంశంలో అక్టోబర్ 28 న హనుమకొండలో జరుగబోయే సదస్సుకు ప్రో.కంచ ఐలయ్య మరియు కళాకారుల కుటుంబ సభ్యులు హాజరవుతారని తెలిపారు. ప్రజలు కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియా స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు దూడపాక నరేష్,తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కన్నం సునీల్,వంశీ, స్వామీ,మణితేజ,జీవన్,తదితరులు పాల్గొన్నారు.
…………………………………….