*పాఠ్యపుస్తకాల్లో జయజయహే తెలంగాణ
* అందెశ్రీ అంత్యక్రియల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : అందెశ్రీ ఆధర్యంలో వచ్చిన సంకలనం నిప్పుల వాగు తెలంగాణ ప్రజలకు
ఓ భగవద్గీత..బైబిల్,,ఖురాన్ లాంటిదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఘట్కేసర్ లోని ఎన్ ఎఫ్సీ నగర్లో జరిగిన అందెశ్రీ అంత్యక్రయల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అందెశ్రీ పాడెను సీఎం భుజాన మోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందెశ్రీ ఆధ్వర్యంలో తెలంగాణ తొలి దశ ,మలి దశ కాలంలో తెలంగాణ కవులు ,రచయితలు రచించిన కవిత లను భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా అందెశ్రీ సంకలనంగా మార్చారని కొనియాడారు. అందెశ్రీ నిప్పుల వాగు పుస్తకాన్ని తెలంగాణ సమాజం అంతా చదివేలా భవిష్యత్ తరాలు స్ఫూర్తి పొందేలా చేస్తామన్నారు. మొత్తం 20 వేల కాపీలను ముద్రించి రాష్ట్రంలోని అన్ని లైబ్రరీల్లో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. యువకులకు ఆ పుస్తకం ఓ ప్రేరణగా ఉంటుందన్నారు. అందెశ్రీ జీవితాన్ని సర్వస్వం తెలంగాణ ప్రజల కోసమే అంకితం చేశారన్నారు.
అన్నతో మాట్లాడుతున్నట్లుగా ఉండేది..
అందెశ్రీతో తాను మాట్లాడుతుంటే పట్నంకు చదుకోవడానికి వచ్చిన తమ్ముడు.. పల్లెటూళ్లో వ్యవసాయం చేసుకుంటున్న అన్న మాట్లాడుతున్నట్లు అనుభూతి కలిగేదని సీఎం రేవంత్ గుర్తుచేసుకున్నారు. పీసీసీ ప్రెసిగెంట్ గా ఉన్న సమయంలో అందెశ్రీని కలువడానికి ప్రయత్నిస్తే తాను రాజకీయ నాయకులను వ్యక్తిగతంగా కలువనని సున్నితంగా తిరస్కరించారని రేవంత్ గుర్తు చేసుకున్నారు. కానీ అందెశ్రీ ఆలోచనలు, సలహాలు ముఖ్యమని భావించే పట్టు వదలకుండా అందెశ్రీని మాట్లాడేందుకు ఒప్పించానని రేవంత్ అన్నారు. తెలంగాణ సమాజ శ్రేయస్సు కోసం అందెశ్రీ సలహాలు సూచనలు అవసరమని తాను భావించానని రేవంత్ అన్నారు. తనలో ఉన్న అంకితభావాన్ని గుర్తించిన అందెశ్రీ తనకు ఎన్నో విలువైన సలహాలు,సూచనలు అందించారని రేవంత్ తెలిపారు.
పాఠ్య పుస్తకాల్లో జయజయహే తెలంగాణ
వచ్చే కేబినెట్ సమావేశాల్లో చర్చించి పాఠ్య పుస్తకాల్లో అందెశ్రీ రచించిన రాష్ట్ర గేయం జయజయహే తెలంగాణను చేర్చుతామన్నారు. అందెశ్రీ పేరిట భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలిచేలా స్మృతి వనం నిర్మాస్తామన్నరు. అందెశ్రీ అభిమానుల, మేధావుల,కళాకారుల సలహాలు సూచనలు తీసుకొని అందెశ్రీ పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేలా నిర్ణయాలు తీసుకుంటామని సీఎం రేవంత్ అన్నారు.
అందెశ్రీ కుటుంబ సభ్యుల్లో ఉద్యోగం
అందెశ్రీ తెలంగాణ కోసం నిస్వార్థంగా సేవలందించాలరని ఏనాడూ డబ్బు గురించి ఆలోచించలేదని సీఎం రేవంత్ అన్నారు. అత్యంత సాదాసీదాగా జీవితాన్ని గడిపిన అందెశ్రీ కుటుంబంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో తాను ఊహించగలనని సీఎం రేవంత్ అన్నారు. అందెశ్రీ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించేందుకు అందెశ్రీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. అందెశ్రీ కుటుంబానికి ఎళ్లవేళలా తోడుగా ఉంటామని సీఎం రేవత్ హామీ ఇచ్చారు.
…………………………………………………………
