* ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్, పీడీ యాక్ట్, పోలీసు వ్యవస్థ బలోపేతం
* అసెంబ్లీలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు
ఆకేరున్యూస్, అమరావతి: భవిష్యత్తులో ఎవరైనా ఆడబిడ్డల జోలికొస్తే కఠిన చర్యలు తప్పవని ఏపీ సీఎం ( AP CM) చంద్రబాబు ( CHANDRABABU) అన్నారు. గురువారం శాసనసభలో చంద్రబాబు మాట్లాడుతూ.. నేరస్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా లా అండ్ ఆర్డర్ ఉంటుందని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారిని వదలబోమని హెచ్చరించారు. గత సర్కారు రాజ్యాంగ విరుద్దంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొచ్చిందని..ఈ చట్టంతో మోసాలు, అక్రమాలకు తెరదీశారని ఆరోపించారు. సివిల్ జడ్జిల అధికారాలను రెవెన్యూ అధికారులకు ఇచ్చారని.. ఎవరినైనా ల్యాండ్ టైట్లింగ్ ఆఫీసర్లుగా పెట్టుకునేలా చట్టాన్ని తెచ్చారని పేర్కొన్నారు. నోటీసు ఇవ్వకుండా భూ యజమాని పేరు మార్చేలా చట్టం తీసుకొచ్చారని.. కింది స్థాయి కోర్టుల్లో ఫిర్యాదులకు తావు లేకుండా నేరుగా హైకోర్టుకు వెళ్లే పరిస్ధితి కల్పించారని సీరియస్ అయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన హావిూ మేరకు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను రద్దు చేశామన్నారు. గ్రామాలు, పట్టణాలు సహా ఎక్కడైనా సరే భూమి కబ్జా చేస్తే ఈ చట్టం వర్తిస్తుందని వ్యాఖ్యానించారు. కొత్త చట్టం ప్రకారం భూ కబ్జా చేసినా, కబ్జాకు ప్రయత్నించినా, బెదిరించినా శిక్ష కఠినంగా ఉంటుందన్నారు. అలాగే కొంతమంది సీనియర్ పోలీస్ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ పోలీసు వ్యవస్థకు మచ్చ తెచ్చారని మండిపడ్డారు. ఇలాంటి వారిని సస్పెండ్ చేశామన్నారు. గతంలో సీఎం టూర్లకు ప్రైవేటు వావానాలను బలవంతంగా కబ్జా చేసి అప్రతిష్ట తెచ్చారని దుయ్యబట్టారు.
………………………………………………