
* అత్యవసరంగా సమావేశమైన జేఏసీ నేతలు
* కీలక డిమాండ్లపై చర్చ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఆర్టీసీ జేఏసీ (RTC JAC) నేతలు అత్యవసరంగా సమావేశం అయ్యారు. వీఎస్టీ సమీపంలోని ఎంప్లాయీస్ కార్యాలయంలో నేతలు ఈరోజు ఉదయం భేటీ అయ్యారు. సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. 21 డిమాండ్ల పరిష్కారం కోరుతూ జేఏసీ ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు సంప్రదింపులకు రావాలని యాజమాన్యానికి లేఖ రాశారు. టీజీఎస్ ఆర్టీసీ ( TGS RTC) కార్మిక సంఘాలు, యాజమాన్యం మధ్య చర్చలు జరగనున్నాయి. కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ ఆధ్వర్యంలో చర్చలు జరగనున్నాయి. సమ్మె చేస్తామని జేఏసీ నేతలు ఇప్పటికే సమ్మె నోటీసు ఇచ్చారు. జేఏసీతో పాటు ఆరు సంఘాలు వేర్వేరుగా సమ్మె నోటీసులు ఇచ్చాయి. సమ్మె నోటీసుపై కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ స్పందించారు. చర్చలకు సిద్ధమయ్యారు.
………………………………………..