
* జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్
ఆకేరు న్యూస్, ములుగు: విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష సాధన కోసం ప్రయత్నిస్తూ ఉన్నత చదువులు చదవాలని కలెక్టర్ దివాకర సూచించారు. ఉన్నాయి గూడెం మండలంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలను సందర్శించి తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన 8, 9, 10 వ తరగతి విద్యార్థులను ఒకే తరగతి గతిలో కూర్చబెట్టి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు. అప్పటికే 10 తరగతిలో ఉపాధ్యాయుడు సోషల్ స్టడీస్ బోధిస్తుండడంతో ఆ పాఠానికి సంబంధించిన ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. విద్యార్థులతో పాఠాలు చదివించారు. విద్యార్థుల తల్లిదండ్రుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా చూడాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.
ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత స్థానంలో నిలవాలని సూచించారు. సమస్యలేవైనా వాటిని అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం కలెక్టర్ కన్నాయిగూడెం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి , ఆరోగ్య కేంద్రంలోని జనరల్ ఇన్ పేషెంట్ వార్డ్‌ను, ల్యాబ్ టెక్నీషియన్ గదిని పరిశీలించారు.
కలెక్టర్ మాట్లాడుతూ, వైద్యాధికారులు, వైద్య సిబ్బంది ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి, మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఉద్యోగులు నిర్దేశిత, హెడ్- క్వార్టర్లలో ఉండాలన్నారు. వర్షకాలంలో మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వ్యాధులనివారణకు అవగాహన కల్పించాలనికోరారు. జనరల్ ఇన్ పేషెంట్ వార్డులో చికిత్స పొందుతున్న రోగుల వివరాలను అడిగి తెలుసుకుని, వైద్యాధికారి, వైద్య సిబ్బంది అందిస్తున్న సేవల పట్ల ఆరా తీశారు. జనరల్ ఓపి రిజిస్టర్ ను పరిశీలించి, ప్రతిరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వైద్య సేవల కొరకు ఎంతమంది వస్తున్నారని, జ్వరంతో వచ్చిన ప్రతి వ్యక్తికి మలేరియా డెంగ్యూ ఆర్డిటి పరీక్షలు చేయాలని, వర్షా కాలానికి సరిపడే మలేరియా డెంగ్యూ ఆర్ డి టి కిట్లు మరియు మందులు అందుబాటులో ఉండేటట్లు చూసుకోవాలని, లేని ఎడల జిల్లా కార్యాలయానికి ఇండెంట్ పెట్టి మందులను సమకూర్చుకోవాలని వైద్యాధికారునికి సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి వెంకట నారాయణ, ఎం పి డి ఓ సాజిద, హెడ్మాస్టర్ రాజ శేఖర, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారుడు డాక్టర్ అభినవ్, ఉపాధ్యాయులు నరేష్, కోటయ్య, లక్ష్మయ్య , విద్యార్థులు, ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్స్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్నారు.
…………………………………………………..