
*హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
ఆకేరు న్యూస్ హైదరాబాద్: హైదరాబాద్ లో వినాయక నిమజ్జనాలు ప్రశాంతంగా జరిగాయని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మొత్తం లక్షా 40 వేల విగ్రహాలు నిమజ్జనం అయినట్లు జీహెచ్ఎంసీ చెబుతోందని అన్నారు. పోలీసులు రెండు రోజులు నిద్ర లేకుండా 40 గంటల బందోబస్తు చేశారని తెలిపారు. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి సభ్యుల సమన్వయంతో అనుకున్న టైమ్ కంటే ముందే నిమజ్జనం పూర్తి చేశామని వివరించారు. పదిరోజులుగా గణేష్ మండపం నిర్వాహకులను ఒప్పించి ఈసారి ముందుగానే వినాయకులను తీయించామని చెప్పుకొచ్చారు. ముందు సౌత్ జోన్ విగ్రహాలు తీయించామని వెల్లడించారు. అక్కడ సెన్సిటివ్ ప్రాంతాలు ఉన్నాయని.. లా అండ్ ఆర్డర్ సమస్యతో ముందు సాత్ జోన్లో విగ్రహాలు నిమజ్జనానికి తరలించామని తెలిపారు. ఆ తర్వాత మిగతా ప్రాంతాల విగ్రహాలను తీయించి నిమజ్జనం చేయించామని పేర్కొన్నారు
……………………………………………………………………………………………