* కాగజ్ నగర్ లో విషాదం
ఆకేరు న్యూస్, కాగజ్నగర్ : కుటుంబకారణాలతో ఓ వ్యక్తి ఆత్మహత్యా యత్నానికి పాల్పడగా అతడిని కాపాడబోయిన భార్య,కూతురు మృతి చెందిన సంఘటన కాగజ్ నగర్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కుటుంబకలహాలతో మనస్తాసానికి గురైన ఓ వ్యక్తి రైలుకింద పడి చావడానికి యత్నంచగా భార్య స్వప్న తన బిడ్డతో సహా రైలు పట్టాలవైపు పరుగులు తీయడంతో వేగంగా వచ్చిన రైలు ఢీకొని తల్లీ కూతుళ్లు మరణించగా భర్త గాయాలతో బయటపడ్డాడు.స్థానికులు వెంటనే గాయపడ్డ అతడిని చికిత్స నిమిత్తం తరలించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు రైల్వే పోలీసులు మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
…………………………..
