
సుప్రీంకోర్టు
* ఉపవర్గీకరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం
* కోటాలో సబ్‌కోటా తప్పుకాదన్న ధర్మాసనం
* 6:1 నిష్పత్తితో వర్గీకరణకు అనుకూలంగా తీర్పు
* 30 ఏళ్ల పోరాటం ఫలించింది
* సహకరించిన మోదీ సహా ప్రముఖులందరికీ ధన్యవాదాలు
* ఆనాడు చంద్రబాబు చేసిన చట్టం వల్లే న్యాయం నిలబడింది : మందకృష్ణ మాదిగ
* భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టిన మందకృష్ణ
* వర్గీకరణ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుంది
* కాంగ్రెస్ పోరాటం వల్లే సుప్రీంకోర్టు తీర్పు : రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్ డెస్క్ : ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ (SC and ST reservations Classification) పై ఎంఆర్పీఎస్ (MRPS) దాఖలు చేసిన పిటిషన్ (Petition) పై సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన తీర్పు ఇచ్చింది. వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల (Education and jobs for reservation) కోసం ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ (SC and ST classification) అవసరమని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ (Chief Justice Chandrachud) నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం 6:1 నిష్పత్తితో తీర్పు వెలువరించింది. దీని వల్ల ఎస్సీ, ఎస్టీల్లోని వెనుకబడిన కులాలకు లబ్ధి జరుగుతుందని అభిప్రాయపడింది. కాగా ధర్మాసనం సభ్యుల్లో ఒకరైన జస్టిస్ బేలా త్రివేది (Justice Bela Trivedi) విభేదించారు. వెనుకబడిన వర్గాలలో మరింత అట్టడుగున ఉన్న వారికి ప్రత్యేక కోటాలను మంజూరు చేయడానికి షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల ఉప-వర్గీకరణ (Sub-classification of Scheduled Castes, Scheduled Tribes) అనుమతించబడుతుందని సుప్రీంకోర్టు గురువారం పేర్కొంది. ఉపవర్గీకరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని పేర్కొంది. ఉపవర్గాలను సృష్టించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదంటూ 2005లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. మూడు రోజుల పాటు కొనసాగిన వాదనల అనంతరం ఈరోజు తీర్పు వెలువడింది.
న్యాయం గెలిచింది : సుప్రీంకోర్టు తీర్పుపై మందకృష్ణ మాదిగ హర్షం..
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ (Mandakrishna Madiga is the founder of MMRPS) హర్షం వ్యక్తం చేశారు. గురువారం ఆయన ఢిల్లీ(Delhi)లో మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉందని తీర్పు ఏడుగురు జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించిందని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పును పేదవర్గాలకు అండగా నిలబడడం కోసం ఇచ్చిన తీర్పుగా భావిస్తున్నామని వ్యాఖ్యానించారు. తాము చేసిన పోరాటం విజయం సాధించిందని ఉద్వేగానికి లోనయ్యారు. ”న్యాయం వైపు సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా మొక్కవోని దీక్షతో ఎమ్మార్పీస్ పోరాటం చేస్తోంది. జాతిని గెలిపించడం కోసం జరిగిన పోరాటంలో ఎంతో మంది ఎమ్మార్పీస్ ఉద్యమకారులు అమరులయ్యారు. వారికి ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నాం. ఎంతో మంది స్వార్థపరులు అడ్డుపడినా న్యాయాన్ని గెలిపించడం కోసం జరిగిన పోరాటంలో సమాజం యావత్తు మావైపు నిలబడింది. ఎమ్మార్పీఎస్ కు అండగా నిలబడ్డ అన్నివర్గాల పెద్దలకు ధన్యవాదాలు. మాకు సహకరించిన ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi), అమిత్ షా(Amit Shah), వెంకయ్య నాయుడు (Venkaiah Naidu), కిషన్ రెడ్డి (Kishan Reddy), రఘునంద్ రావు (Raghunand Rao), ఈటల రాజేందర్ (Etala Rajender) ధన్యవాదాలు. వర్గీకరణ చేసిన ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu) కు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నామ”ని మందకృష్ణ మాదిగ (Mandakrishna Madiga) అన్నారు. చంద్రబాబు సీఎంగా ఉండడం వల్ల ఏపీ (AP)లో ఎస్సీ వర్గీకరణ అమలవుతుందని మందకృష్ణ మాదిగ విశ్వాసం వ్యక్తం చేశారు. ”షెడ్యూల్ కులాల వర్గీకరణ అనేది గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసింది. ఆనాడు వర్గీకరణ చేసిన చంద్రబాబే.. ఈనాడు తీర్పు వచ్చే సమయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి (Andhra Pradesh CM)గా ఉన్నారు. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నాం. ఆయన ఆనాడు వర్గీకరణ చేయకపోతే వేలాది ఉద్యోగాలు, విద్యావకాశాలు మాకు వచ్చేవి కాదు. ఆయన తీసుకొచ్చిన చట్టం వల్లే మాకు ఈనాడు న్యాయం జరిగింద”ని మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు.
వర్గీకరణ అమలులో ముందుంటాం : రేవంత్ రెడ్డి
– తెలంగాణ అసెంబ్లీలో చర్చ
సుప్రీంకోర్టు చారిత్రాత్మకమని, వర్గీకరణ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ముందుంటుంది తెలంగాణ సీఎం రేవంత్ (Telangana CM Revanth Reddy) రెడ్డి తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ పోరాటం వల్లే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని వెల్లడించారు. వర్గీకరణపై అసెంబ్లీ (Assembly) లో చర్చ జరిగింది. చర్చకు ప్రతిపక్షం సహకరించాలని రేవంత్ కోరారు. అవసరమైతే ఇప్పటికే విడుదలైన నోటిఫికేషన్లను కూడా వర్గీకరణకు అనుగుణంగా సవరిస్తామని చెప్పారు. త్వరలోనే దీనిపై ఆర్డినెన్స్ (Ordinance) జారీ చే్స్తామన్నారు. వర్గీకరణపై చర్చలో దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ వర్గీకరణ ఏ వర్గానికీ వ్యతిరేకం కాదని తెలిపారు. తీర్పునకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. దండోరా ఉద్యమానికి అన్ని వర్గాలనుంచీ మద్దతు లభించిందని కడియం శ్రీహరి (Kadiam Srihari) పేర్కొన్నారు. వర్గీకరణను వెంటనే అమలు చేయాలని కేసీఆర్ (KCR) ఎప్పుడో తీర్మానం చేశారని మాజీ మంత్రి హరీశ్‌రావు (Former minister Harish Rao) తెలిపారు.
————————