* అలహాబాద్ హైకోర్టు తీర్పును తప్పుబట్టిన సుప్రీం ధర్మాసనం
ఆకేరు న్యూస్ డెస్క్ : మదర్సా విద్యా చట్టం 2004 (MADARSA VIDYA CHATTAM – 2004) రాజ్యాంగ విరుద్ధమంటూ గతంలో అలహాబాద్ హైకోర్టు(ALLAHABAD HIGH COURT) ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు(SUPRIM COURT) తప్పుబట్టింది. అది రాజ్యాంగం బద్దమే పేర్కొంది. విద్యా సంస్థలు స్థాపించి, నిర్వహించే మైనార్టీల హక్కులను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవద్దని యోగి సర్కారు(yOGI GOVERNMENT)కు స్పష్టం చేసింది. సుప్రీం తీర్పుతో ఉత్తరప్రదేశ్లోని 16000 మదర్సాలకు ఊరట కలగనుంది. సుమారు 17 లక్షల మంది మదర్సా విద్యార్థులకు మేలు కలగనుంది. లౌకికవాద సూత్రాలను ఉల్లంఘిస్తోందని మదర్సా విద్యా చట్టాన్ని కొట్టివేసిన అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వును రద్దు చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్(JUSTICE DY CHANDRACHOOD), న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం మదర్సా విద్యా చట్టం 2004ను “రాజ్యాంగ విరుద్ధం” అని కొట్టివేస్తూ మార్చి 22న హైకోర్టు(HIGI COURT) ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. “మేము యూపీ మదర్సా ఎడ్యుకేషన్ యాక్ట్ యొక్క చెల్లుబాటును సమర్థించాము. ఒక రాష్ట్రానికి శాసనసభ సామర్థ్యం లోపిస్తే చట్టాన్ని కొట్టివేయవచ్చు” అని బెంచ్ పేర్కొంది. ఈ తీర్పుపై ముస్లిం మైనార్టీవర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
………………………………………….