
* ఆగస్టు 21 సాయంత్రం విశ్వంభర గ్లిమ్స్
* అందుకే ఆలస్యం..అంటున్న మెగాస్టార్
ఆకేరు న్యూస్,డెస్క్ : మెగా స్టార్ సినిమా విశ్వంభర కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.వెండితెరపై మెగాస్టార్ ను ఎప్పుడెప్పుడు చూస్తామా అన్న ఆతృతతో ఉన్నారు. అభిమానుల అందోళనను అర్థం చేసుకున్న మెగాస్టార్ ఎక్స్ వేదికగా విశ్వంభర ఎందుకు ఆలస్యం అవుతోందో చెప్పారు. ఈ సినిమాలో సెంకడ్ ఆఫ్ అద్బుతంగా ఉంటుందని స్పెషల్ ఎఫెక్ట్స్ విజ్యువల్ గ్రాఫిక్స్ పర్ ఫెక్ట్ గా రావడం కోసమే సినిమా డిలే అవుతోందన్నారు. ఈ సినిమా కథ చందమామ కథలా చిన్నపిల్లలను ఆకర్శిస్తుందని మెగాస్టార్ తెలిపారు. ఇంతకీ ఈ సినిమా రిలీజ్ పై మెగాస్గార్ ఏమన్నారంటే వేసవి సెలవుల్లో రిలీజ్ అయితే అందరూ ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చన్నారు. అంటే ఈ సినిమా కోసం మే నెల వరకు వేచి చూడాల్సిందే…
…………………………………………………………..