* రాచకొండ సీపీ ఎదుట హాజరు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రాచకొండ సీపీ సుధీర్ బాబు ఎదుట గురువారం ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు. కాకరాల సునీత(Kakarala Sunitha)తో పాటు మరో మావోయిస్టు తమ ఎదుట లొంగిపోయారని సుధీర్ బాబు (Sudhirababu) తెలిపారు. కాకరాల సునీత తండ్రి కాకర్ల సత్యనారాయణ, ఒక విప్లవ రచయితల సంఘం నాయకుడిగా పని చేసినట్లు గుర్తించామన్నారు. వరవరరావు, గద్దల్ లాంటి విప్లవకారులు వారి ఇంటికి రావడంతో సునీత పీపుల్స్ వార్ వైపు మొగ్గు చూపారని తెలియజేశారు. 1986లో పీపుల్స్ వార్ పార్టీలో కాకరాల సునీత చేరారని వివరించారు. 1986 ఆగస్టులో ఆమెను టిఎల్ఎన్ చలం గౌతమ్ అలియాస్ సుధాకర్‌ను పెళ్లి చేసుకున్నారని, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో సెంట్రల్ ఆర్గనైజర్‌గా పని చేశారని తెలిపారు. 1992లో నల్లమల అడవుల్లోకి వెళ్లి అనంతరం 2001లో ఏఓవీ నుంచి 2006 దండకారణ్యానికి సునీత బదిలీ అయ్యారని పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీ సిద్ధాంతాల రూపకల్పనలో సునీత కీలక పాత్ర పోషించారని అన్నారు. మావోయిస్టు పత్రిక జంగ్ క్రాంతికి ఎడిటర్‌గా పని చేశారని, శాంతి చర్చల ప్రక్రియలోనూ కీలక పాత్ర పోషించారన్నారు. ఇప్పటి వరకు ఐదు ప్రధాన ఎన్కౌంటర్లలో పాలుపంచుకున్నారని సీపీ తెలిపారు. చెన్నూరి హరీశ్ (Chennuri Harish) అలియాస్ రమణ కూడా సీపీ ఎదుట లొంగిపోయారు. ఆయన పదో తరగతి చదువుతున్నప్పుడే ఏటూరి నాగారం బీసీ వెల్ఫేర్ హాస్టల్ లో ఉండగా మావోయిస్టు సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యారు. 2024లో ఏసీఎం గా పనిచేశారు. వారిద్దరూ జనస్రవంతిలో కలవడం మంచి పరిణామని, మిగిలిన వారు కూడా జనజీవన స్రవంతిలో కలవాలని సీపీ పిలుపునిచ్చారు.
……………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
