ఆకేరున్యూస్, వరంగల్ : కాకతీయ యూనివర్శిటీ కొత్త పీజీ హాస్టల్ ఆవరణలోని ప్రాంతంలో అధికారులు సర్వేనిర్వహించారు. కేయూ పరిధిలో ఆక్రమణ భూములపై బుధవారం సర్వే కొనసాగింది. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు రాకేష్, అనిల్, హనుమకొండ మండల రెవెన్యూ విభాగ సర్వేయర్ రాజేశ్, మున్సిపల్ శాఖ బిల్డింగ్ ఇన్ స్పెక్టర్ రాజు నాయక్, వర్శిటీ అభివృద్ధి అధికారి ఎన్.వాసుదేవరెడ్డి నేతృత్వంలో కొత్త పీజీ హాస్టల్ ఆవరణలోని ప్రాంతంలో సర్వే నిర్వహించారు. వర్సిటీ భూ పరిధి సర్వే నంబర్ 229లోని 6.15 ఎకరాల భూమికి హద్దులు నిర్ణయించి గుర్తులను వేశారు. ఈ భూమిలో 11 నివాస భవనాలు, ఐదు ఖాళీ ప్రాంతాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కొందరు ఇతర సర్వే నంబర్ లలో నిర్మాణాలు చేసుకున్నట్లు అంచనా వేశారు. రిజిస్ట్రార్ ఆచార్య పీ.మల్లారెడ్డి సర్వేను పర్యవేక్షించారు. ఇన్చార్జి ఉపకులపతి వాకాటి కరుణ ఆదేశానుసారం ఆక్రమణకు గురైన భూమిని గుర్తించి సంబంధిత అధికారుల సహాయంతో చర్యలు తీసుకుంటామని రిజిస్ట్రార్ తెలిపారు.
———————–