* సినిమా థియేటర్లలో పార్కింగ్ రేట్ల పై పరిశీలన.
* అక్రమ నిర్మాణాలపై ఫోకస్ పెట్టాలి .
* కమిషనర్ అమ్రపాలి
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : స్వచ్ఛ ఆటోల హాజరు పై దృష్టి పెట్టాలని జీహెచ్ఎంసీ (GHMC) కమిషనర్ ఆమ్రపాలి కాట (Amrapali Kata) అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాట మాట్లాడుతూ… రోజు విధులకు హాజరు కాని స్వచ్ఛ ఆటోల వివరాలు సేకరించి వారి పై తగిన చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్ లను ఆదేశించారు. కమర్షియల్ ప్రాంతాల్లో స్వచ్ఛ ఆటోలు రాత్రి సమయంలో మాత్రమే చెత్త సేకరించాలి అలాగే సినిమా థియేటర్లలో పార్కింగ్ రేట్ల పై పరిశీలన చేయాలని అడిషనల్ కమిషనర్ యూసీడీ కి తెలిపారు. అక్రమ భవన నిర్మాణాల పై ఫోకస్ పెట్టాలని జోనల్ కమిషనర్లను ఆదేశించారు. శేరిలింగంపల్లి జోన్ లో శానిటేషన్ ను రోల్ మోడల్ గా చేయాలని జోనల్ కమిషనర్ ను ఆదేశించారు. వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద పెద్ద సంపుల నిర్మాణలను చేపట్టేందుకు టెండర్ పక్రియను పూర్తి చేయాలని తెలిపారు. డెంగ్యూ వ్యాధి వచ్చిన వ్యక్తుల సమాచారం రోజు వారీగా జోన్ల నుండి మధ్యాహ్నం వరకు హెడ్ ఆఫీస్ కు తప్పని సరిగా పంపాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో అడిషనల్, జోనల్ కమిషనర్లు, ఎంటమాలజీ చీఫ్ తదితరులు పాల్గొన్నారు.
————————————————