
* అడిషనల్ కలెక్టర్ సంపత్ రావు
ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లా వ్యాప్తంగా స్వచ్చ సర్వేక్షన్ 2025 ప్రారంభం అవుతుందనీ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్ రావు తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్ ప్రత్యేక ఆప్ ద్వారా సర్వే నిర్వహించి ఉత్తమ గ్రామ పంచాయితీలకు గాను పురస్కారాలు అందించనున్నారని, ములుగు జిల్లా వ్యాప్తంగా 10 మండలాలు, 171 గ్రామపంచాయితీలు ఉన్నాయని అన్నారు. ఎంపిక చేసిన 20 గ్రామాలలో, కేంద్రం ఎంపిక చేసిన 16 ఇళ్ళ లో సర్వే నిర్వహించనున్నారు. అందులో ప్రత్యేకంగా మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, తడి, పొడి చెత్త నిర్వహణ, గ్రామపంచాయితీలలో సానిటేషన్, పరిశుభ్రత తదితర అంశాలను సర్వే చేయనున్నారని అన్నారు.అలాగే గ్రామ పంచాయితీ భవనం, పాఠశాలలు, అంగన్ వాడి కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, తదితర గ్రామపంచాయితీ అసెట్స్ ని తనిఖీ నిర్వహించనున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బృందం మధు, రాకేష్, రాజు వెంకటనారాయణ, SBM కోఆర్డినేటర్లు, తదితరులు పాల్గొన్నారు.
………………………………………