* తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టో
* గాంధీభవన్ లో విడుదల చేసిన కాంగ్రెస్
* అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలతో సక్సెస్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఆరు గ్యారెంటీలతో అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగించిన తెలంగాణ కాంగ్రెస్.. లోక్సభ ఎన్నికలకు ఐదు న్యాయాలను తెరపైకి తెచ్చింది. ఇప్పటికే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ‘న్యాయ్ పత్ర’ పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసింది. కాగా, తెలంగాణకు ప్రత్యేకంగా ఈరోజు గాంధీభవన్లో టీ.కాంగ్రెస్ నేతలు ఐదు న్యాయాలు – తెలంగాణకు ప్రత్యేక హామీల పేరుతో మేనిఫెస్టో విడుదల చేశారు. రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ముఖ్యంశాలను అందులో పొందుపరిచారు. ఖాజీపేటలో రైల్వే కోచ్ ఏర్పాటు, బయ్యారంలో ఉక్కు కర్మాగారం, హైదరాబాద్ లో ఐటీఐఆర్ ప్రాజెక్టు పునఃప్రారంభం, ఏపీలో విలీనమైన ఐదు గ్రామాలను తెలంగాణలో కలపడం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, మేడారం సమ్మక్క సారక్క జాతరకు జాతీయహోదా, హైదరాబాద్ లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు వంటి అంశాలను టీ.కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నాయి.
ఏమిటా ఐదు న్యాయాలు అంటే..
– సమన్యాయం
– రైతు న్యాయం
– కార్మిక న్యాయం
– యువ న్యాయం
– మహిళా న్యాయం
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాలకూ న్యాయం జరుగుతుందని చాటచెప్పేందుకు మేనిఫెస్టోలో ఈ అంశాలను పొందుపరిచింది.
—————————–