* ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ప్రారంభించిన మంత్రి శ్రీధర్‌బాబు
* మీ సేవలో మరిన్ని కొత్త సర్వీసులు అందుబాటులోకి..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఐటీ, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన- ప్రజా విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు (MINISTER SRIDHARBABU) టీ-ఫైబర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ గ్రామస్తులతో లైవ్‌లో మాట్లాడారు. ఫైబర్ నెట్ రావడం వల్ల సంతోషంగా ఉందా అని అడిగి తెలుసుకున్నారు. టీవీలో మై కంప్యూటర్ యాప్ ఉండడం చాలా ఉపయోగంగా ఉందని, ల్యాండ్ లైన్ టెలిఫోన్ కూడా ఇచ్చారని, తాము బయట ఉన్నా ఇంట్లో ఉన్న పెద్దవాళ్లతో మాట్లాడే అవకాశం దొరకడం ఆనందంగా ఉందని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. మంత్రి మాట్లాడుతూ.. టీ ఫైబర్ (T-FIBER)ద్వారా తొలుత మూడు ప్రధాన జిల్లాలు మహబూబ్‌నగర్, సంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాలోని మూడు గ్రామాల్లో ఫైబర్ నెట్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. అలాగే, తెలంగాణలో 12 ఇండస్ట్రియల్ పార్కులు (INDUSTRIAL PARK)ప్రారంభించనున్నట్లు వివరించారు. అలాగే మీ సేవలో మరిన్ని కొత్త సర్వీసులను శ్రీధర్‌బాబు ప్రారంభించారు. మీ సేవ యాప్(MEE SEVA APP)ను ప్రారంభించారు. మొబైల్ లోనే మీ సేవలను పొందొచ్చని సూచించారు.
……………………………..