* ప్రధానిని కలిసిన భారత క్రికెటర్లు
ఆకేరు న్యూస్ డెస్క్ : టీ20 ప్రపంచకప్ (T20 World Cup) ను గెలిచిన భారత్ జట్టు.. బార్బడోస్ (Barbados) లో సంభవించిన తుఫాను కారణంగా ఇప్పటి వరకు అక్కడే ఉండిపోయారు. ఎయిరిండియా ప్రత్యేక విమానంలో ఈరోజు స్వదేశానికి తిరిగి వచ్చారు. బార్బడోస్ నుంచి ఆటగాళ్లందరూ ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఆటగాళ్లకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి హోటల్‌కు చేరుకున్నారు. అనంతరం రోహిత్ శర్మ (Rohit Sharma) నాయకత్వంలోని ఆటగాళ్లంతా ప్రధాని మోదీ (Modi) నివాసానికి వెళ్లారు. ప్రధానితో కలిసి క్రికెటర్లు బ్రేక్ ఫాస్ట్ చేశారు. ప్రధానిని కలిసిన తర్వాత టీమిండియా క్రికెటర్లు చార్టర్డ్ ఫ్లయిట్లో ఢిల్లీ నుంచి ముంబై బయలుదేరారు. ముంబై ఎయిర్పోర్ట్ నుంచి వాంఖడే మైదానానికి చేరుకుంటారు. నారీమన్ పాయింట్ నుంచి వాంఖడే స్టేడియం వరకు ఆటగాళ్లు అభిమానులకు అభివాదం చేస్తూ.. ఓపెన్ బస్సులో ప్రయాణిస్తారు. వాంఖడేలో నిర్వహించిన కార్యక్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. బీసీసీఐ కార్యదర్శి జై షాకు వరల్డ్ కప్ ట్రోఫీని అందజేస్తారు. వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ ఇప్పటికే రూ.125 కోట్ల భారీ నజరానా ప్రకటించిన సంగతి తెలిసిందే.
———————