Tabu Slum Dog Role
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : దర్శకుడు పూరి జగన్నాథ్ , హీరో విజయ్ సేతుపతి కలయికలో వస్తున్న చిత్రం స్లమ్ డాగ్.. 33 టెంపుల్ రోడ్ అనేది సబ్ క్యాప్షన్. స్లమ్ డాగ్ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌ను ఇటీవల చెన్నైలో నిర్వహించారు. ఈ చిత్రం నుంచి తాజా అప్డేట్ వచ్చింది.
* టబు .. గౌరీ హెగ్డే
స్లమ్ డాగ్ నుంచి తాజాగా ప్రముఖ నటి టబుకు సంబంధించిన ఒక వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో ఆమె పాత్ర పేరు గౌరీ హెగ్డే అని పరిచయం చేసింది. ఇందులో ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్(డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఇన్ కామ్ టాక్స్) గా టబు కనిపించబోతుందని తెలిపింది. ‘‘ మా ఓల్డ్ సిటీలో ముందు కాలుస్తాం.. ఆ తర్వాతే మాట్లాడుతాం ’’ అంటూ నటుడు విజయ్ సేతుపతితో అన్న డైలాగ్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
* టీజర్ ఇరగదీసింది..
రేయ్ కోన్ హే రే తుమ్ హమారా బస్తీమే కివ్ ఆయే అంటూ వీడియో స్టార్ట్ అవుతుండగా.. లాగి చెప్పమీద కొట్టి ఏ బస్తీ తేరే బాప్ కి హై రే భాడ్ కవు చల్ హట్ అంటూ గౌరీహెగ్డే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఇన్ కాం టాక్స్ గా టబు డైలాగ్ చెప్పడం అదిరిపోయింది. తర్వాత యాక్షన్ సీన్స్ సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లేలా కనిపిస్తున్నాయి. టబు డిఫారెంట్ మ్యానరిజమ్ తో డైలాగులు పలకడం టపాసులా పేలింది. పూరి చిత్రం అంటే ఆ మాత్రం మాస్ డైలాగ్ డెలివరీ ఉందదేంటి?.
* నాగ్ 100 లో విలన్ గా ..
నాగార్జున మూవీ’ కింగ్ 100′ లో టబు విలన్ పాత్ర పోషించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రేజీ కాంబినేషన్ దాదాపు 28 ఏళ్ల తర్వాత మళ్లీ స్క్రీన్‌ను పంచుకోబోతుండటం విశేషం. అప్పుడెప్పుడో నిన్నపెళ్లాడతా సినిమా లో కలిసి నటించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
