* బయటపడుతున్న లొసుగులు
ఆకేరు న్యూస్, కర్నూలు : కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో దహనమైన బస్సులో లోపాలు బయటపడుతున్నాయి. సీటింగ్ కు అనుమతి తీసుకుని రిజిస్ట్రేషన్ మార్చి స్లీపర్ క్లాస్ గా వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు అక్రమాలకు తెరదీసినట్లు గా తెలుస్తోంది. బస్సు డిజైనింగ్ లోనూ లోపాలు బయటపడుతున్నాయి. 2018లో తెలంగాణలో బస్సు రిజిస్ట్రేషన్ చేయించారు. 2023లో ఎన్ ఓసీతో డయ్యు డామన్ లో రిజిస్ట్రేషన్ జరిగింది. తర్వాత నేషనల్ పర్మిట్ తో బస్సును నడుపుతున్నారు. డయ్యు డామన్ నుంచి ఒడిశాలోని రాయగడకు తెచ్చి అక్కడ ఆల్ట్రేషన్, ఫిట్ నెస్ చేయించారు. ఆల్ట్రేషన్ సీటింగ్ కు రాయగడ ఆర్టీఓ అనుమతి ఇచ్చింది. రీడిజైన్ లో 43 సీట్లకు అనుమతి తీసుకుని స్లీపర్ క్లాస్ గా మార్చారు. అంతేకాకుండా వేమూరి కావేరి ట్రావెల్ బస్సుపై చాలా జరిమానాలు ఉన్నాయి. ఇటీవల ఓవర్ స్పీడ్, డేంజర్ స్పీడ్ చలాన్లు నమోదయ్యాయి. మొత్తం రూ.23 వేల వరకు ఫైన్లు ఉన్నాయి. వేమూరి కావేరి సంస్థకు చెందిన బస్సు డ్రైవర్లు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారనే దానికి ఈ జరిమానాలే నిదర్శనమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
……………………………………………..
