* దమ్ముంటే హైదరాబాద్ పేరు మార్చండి
* ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి తలసాని సవాల్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పునర్విభజన అడ్డగోలుగా చేశారని, క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా గూగుల్ మ్యాప్‌ల ఆధారంగా చేసినట్లు ఉందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) ఆరోపించారు. జంట నగరాల ఉనికి లేకుండా కుట్ర పన్నుతున్నారని అన్నారు. చారిత్రకంగా పేరున్న సికింద్రాబాద్‌ను అడ్డదిడ్డంగా విభజించారని అన్నారు. దమ్ముంటే హైదరాబాద్ పేరు మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanthreddy) కి సవాల్ విసిరారు. డివిజన్లను కూడా సరిగా విభజించలేదని అన్నారు. 24 నియోజకవర్గాలు ఉన్న మహానగరాన్ని విభజిస్తున్నప్పుడు ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోలేదని తెలిపారు. ప్రజలకు పరిపాలన సౌలభ్యం కోసం తమ ప్రభుత్వ హయాంలో 150 డివిజన్లు చేశామన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహానగరాన్ని ఇష్టమొచ్చినట్లు విభజిస్తుందని మండిపడ్డారు. విభజన తీరుపై చట్టపరంగా, న్యాయపరంగా పోరాడతామని వెల్లడించారు.
……………………………………………..

