* టెస్ట్ లో డ్రగ్ పాజిటివ్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎమ్మెల్యే కుమారుడు డ్రగ్స్ కేసులో తెలంగాణ పోలీసులకు పట్టుబడ్డాడు. నార్సింగ్ లో కొందరు డ్రగ్స్ తీసుకుంటున్నట్లు సమాచారం అందడంతో హైదరాబాద్ నానక్ రామ్‌గూడలో ఈగల్ టీమ్ తనిఖీలు నిర్వహించింది. టీమ్ దాడుల్లో దొరికిన వారిలో జమ్మలమడుగు నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి పట్టుబడ్డాడు. గంజాయి తీసుకుంటూ దొరికాడు. డ్రగ్స్ టెస్టులో సుధీర్ రెడ్డికి పాజిటివ్ వచ్చింది. ఆయనతో పాటు మరో ముగ్గురిని అందుబాటులోకి తీసుకుని డీ ఆడిక్షన్ సెంటర్ కు తరలించినట్లు అధికారులు తెలిపారు.
………………………………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
