* ఆయనను సస్పెండ్ చేయకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటాం
* మీడియా ముందుకు బాధితురాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఓ టీడీపీ ఎమ్మెల్యే తనపై లైంగిక దాడి చేశాడని, అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే మంగళగిరిలోని టీడీపీ కార్యాలయం ఎదుట కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం(TDP MLA KONETI ADHIMULAM)పై ఆమె లైంగిక ఆరోపణలు చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఎన్నికల్లో ఆయన తరఫున ప్రచారం చేసిన సందర్భంలో తన ఫోన్ నంబర్ తీసుకున్నాడని అన్నారు. పలుమార్లు కాల్ చేసి లైంగికంగా వేధించేవాడని ఆరోపించారు. ఆయన వేధింపులు భరించలేక.. జూలై 6న తిరుపతి(TIRUPATHI)లోని ఓ లాడ్జి(LODGE)కి వెళ్తే తనపై లైంగికదాడికి పాల్పడ్డాడని ఆమె పేర్కొంది. విషయం భర్తకు చెబితే ఆయన పెన్ కెమెరా ఇచ్చాడని ఆయన వేధింపులను రికార్డు చేశానని తెలిపారు. హైదరాబాద్(HYDERABAD)లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆమె విలేకరుల ఎదుట తన గోడు వెలిబుచ్చారు. కాగా, ఎమ్మెల్యే ఓ మహిళతో అసభ్యకరంగా గడుపుతున్న వీడియోలు సోషల్‌మీడియాలో(SOCIAL MEDIA) వైరల్ అవుతున్నాయి.
అది సొంత పార్టీ నేతల కుట్ర..
తనపై వచ్చిన ఆరోపణలపై ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్పందించారు. సొంతపార్టీ నేతలే తనపై కుట్రచేశారని, ఆమెతో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఆ వీడియో మార్ఫింగ్ చేసినట్లు కనబడుతోందని..తానేంటో నియోజకవర్గ ప్రజలకు తెలుసునని ట్విటర్ (ఎక్స్) లో పోస్టు చేశారు.
———————————–