Station Ghanpur Teachers Day Celebrations
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం సందర్భంగా నిర్వహించే ఉపాధ్యాయ దినోత్సవాన్ని జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పరిధి చాగల్లులో శనివారం నిర్వహించగా స్థానిక 6వ,8వ వార్డుల కౌన్సిలర్లు ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. 6వ వార్డు కౌన్సిలర్ బాలగాని అనిల్, 8వ వార్డు కౌన్సిలర్ పూర్ణ రాజేష్ లు మాట్లాడుతూ సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులని వారిని సత్కరించుకోవలసిన బాధ్యత మనపై ఉందన్నారు. నేటి బాలలను రేపటి భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయుల పర్యవేక్షణలో బాగా చదివి విద్యార్థులు తల్లిదండ్రులకు, గ్రామాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో చాగల్ హెచ్ఎం అంజిరెడ్డి, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం ఖాదర్, మాజీ హెచ్ఎం కొమరయ్య తదితరులు పాల్గొన్నారు.
“ఘనంగా గురుపూజోత్సవం” సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదిన సందర్భంగా మండలంలోని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలో గురుపూజోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ ఉపాధ్యాయుని ఘనంగా సత్కరించుకున్నారు. ఆయా ప్రభుత్వ పాఠశాలలలో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమాలలో ఎంఈఓ రమేష్ ప్రధానోపాధ్యాయులు సంపత్ కుమార్, వెంకటేశ్వర్లు, వేణు ప్రైవేటు పాఠశాలలలో మల్లేశం, సంజీవరెడ్డి, కొండయ్య, బెన్నీ జార్జ్, సీజు, కిరణ్ కుమార్, శ్రీనివాస్, జోసెఫ్, సరళ అరుణాచలం తదితరులు పాల్గొని గురుపూజోత్సవం ఘనంగా నిర్వహించుకున్నారు.
“విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో” స్థానిక విద్యార్థి సంఘాలు ఏఐఎస్ఎఫ్, ఐవైసీ ఆధ్వర్యంలో మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులను శాలువాలతో సత్కరించి గురుపూజోత్సవాన్ని నిర్వహించుకున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
