Ramappa Temple Somasutra Restoration
ఆకేరు న్యూస్, ములుగు: యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడమైన రామప్ప దేవాలయం గర్భాలయంలో అభిషేకాల అనంతరం అభిషేక జలాన్ని బయటకు పంపేందుకు ఉద్దేశించిన ప్రాచీన సోమసూత్రాన్ని భారత పురావస్తు సర్వేక్షణ (ఏఎస్ ఐ)హైదరాబాద్ సర్కిల్ విజయ వంతంగా పునరుద్ధరించింది. దశాబ్దాల కాలం క్రితం సోమసూత్రం మూసుకుపోవడం వల్ల ఆగమ శాస్త్ర ప్రకారం అభిషేకాలు నిర్వహించడానికి ఆటంకం ఏర్పడింది.
ఈ పునరుద్ధరణ పనులను విధ్వంసంలేని, శాస్త్రీయ పరిరక్షణ పద్ధతులతో ఆధునిక పరికరాల ఉపయోగించారు. ఈ ప్రక్రియలోఅంతర్గత అడ్డంకులకు సంబంధించి శాస్త్రీయ 3D మ్యాపింగ్,
ఎండోస్కోపిక్ కెమెరాలు,గొప్రో కెమెరాలతో రియల్-టైమ్ మానిటరింగ్ స్క్రీన్ల ద్వారా తనిఖీ, దేవాలయ అసలు నిర్మాణానికి ఎటువంటి నష్టం కలగకుండా సాఫ్ట్-డ్రిల్లింగ్ విధానంలో పొరలు పొరలుగా అడ్డంకులను జాగ్రత్తగా తొలగించారు.
ఈ పనులు తెలంగాణ ప్రభుత్వ దేవాదాయ శాఖఅధికారుల సమక్షంలో(ఎఎస్ఐ), ఆసియ హైదరాబాద్ సర్కిల్ బృందం ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించబడ్డాయి. ప్రస్తుతం సోమసూత్రం పూర్తిగా పనిచేసే స్థితిలో ఉంది, భక్తులు ఎటువంటి ఆటంకం లేకుండా ఆగమ శాస్త్ర ప్రకారం అభిషేకాలు నిర్వహించుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పురావత్ శాఖ డిఈ కృష్ణ చైతన్య, సీఏలు మల్లేష్ ,అజిత్, వంశీకృష్ణ, దేవాదాయ శాఖ ఈఓ ఇమ్మడి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
* రామప్పను సందర్శించిన జియోలాజికల్ అధికారులు
రామప్ప దేవాలయంను శనివారం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అడిషనల్ డైరెక్టర్ జనరల్ వివి ముఘల్, డిప్యూటీ డైరెక్టర్ శేషాసాయిలు సందర్శించారు. ఈ సందర్బంగా ఆలయ అర్చకులు హరిశ్ శర్మ, ఉమాశంకర్ లు వారికి స్వాగతం పలికి ప్రత్యేక పూజలుచేసి తీర్థ ప్రసాదాలు అంద జేశారు. ఆలయ చరిత్ర, శిల్పకళ ప్రాముఖ్యత గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ వివరించారు. అనంతరం రామప్ప చెరువు సందర్శించారు. వారి వెంట జీ ఎస్ ఐ అధికారులు, సిబ్బంది, ఈవో ఇమ్మడి భాస్కర్, టూరిస్ట్ పోలిసులు అరుణ్,శ్రీకాంత్, బద్రు, దేవాదాయ,పురావస్తు టూరిజం శాఖల సిబ్బంది తదితరులున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
