* అభిషేక్ నాయర్‌కు దక్కే అవకాశం!
ఆకేరు న్యూస్, స్పోర్ట్స్ డెస్క్ :టీమిండియా (Team India) కొత్త కోచ్‌గా ఇటీవలే గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) నియమితులయ్యారు. ఇప్పుడు అసిస్టెంట్ కోచ్ (Assistant coach) ఎవరు అనేది ఆసక్తిగా మారింది. ఆమేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కసరత్తు ముమ్మరం చేసింది. ప్రస్తుత సమాచారం మేరకు టీమ్ ఇండియా మాజీ ఆల్ రౌండర్, కోల్‌కతా నైట్ రైడర్స్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ (Abhishek Nair) కు ఆ చాన్స్ దక్కవచ్చని తెలుస్తోంది. ప్రధాన కోచ్‌ను ప్రకటించిన తర్వాత ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్, మిగిలిన కోచింగ్ స్టాఫ్‌ల కోసం బీసీసీఐ(BCCI) అన్వేషిస్తోంది. అలాగే, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌ల నియామకాలు చేపట్టనుంది. తాజా సమాచారం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన కోల్‌కతా నైట్ రైడర్స్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ భారత జట్టుకు కొత్త అసిస్టెంట్ కోచ్ కావచ్చు. మాజీ ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ ఫీల్డింగ్ కోచ్‌గా కొనసాగవచ్చు. బౌలింగ్ కోచ్ పదవి కోసం లక్ష్మీపతి బాలాజీ, వినయ్ కుమార్ పేర్లను బీసీసీఐ, గంభీర్ పరిశీలిస్తున్నారు. వీరిద్దరూ గతంలో గంభీర్‌తో కలిసి కేకేఆర్‌లో పనిచేశారు.
———————–