
* ఏర్పాట్లు చేసిన విద్యాశాఖ
* ఈ సారి కొత్తగా మార్కులతో పాటు- సబ్జెక్టుల వారీగా గ్రేడ్స్
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణ పదో తరగతి ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ సారి కొత్తగా మార్కులతో పాటు- సబ్జెక్టుల వారీగా గ్రేడ్స్ ప్రకటించనున్నారు. ఆ విధంగానే మార్క్స్ మెమోలు జారీ కానున్నాయి. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరిగిన పది పరీక్షలకు 5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. విడుదలైన పదో తరగతి ఫలితాలను వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఇక నుంచి పదో తరగతి మెమోల్లో సబ్జెక్టులవారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వనున్నారు. జీపీఏ అనేది తీసివేయనున్నారు. మార్కుల మెమోలపై సబ్జెక్టులవారీగా రాత పరీక్షలు, ఇంటర్నల్ పరీక్షల మార్కులు, మొత్తం మార్కులు, గ్రేడు పొందుపరచనున్నారు. చివరగా విద్యార్థి పాసయ్యారా? ఫెయిల్ అయ్యారా? అనేది వివరంగా ఇస్తారు.
………………………………………………….