Kaushik Reddy Ethics Committee Notice
* రేపటిలోగా ఆన్సర్ ఇవ్వాలని ఆదేశం
* ఎథిక్స్ కమిటీ సీరియస్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి బీఆరఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన ప్రవర్తనపై వచ్చిన వివాదానికి సంబంధించి తెలంగాణ శాసనసభ ఎథిక్స్ కమిటీ కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో కోరినట్లు తెలుస్తోంది. రేపటిలోపు తన సమాధానాన్ని సమర్పించాలని కమిటీ ఆదేశించినట్లు సమాచారం. మార్చి 29న జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కౌశిక్ రెడ్డి ప్రవర్తనపై వివాదం నెలకొంది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన అసెంబ్లీ వర్గాలు తదుపరి చర్యలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఆగస్టు 29న ఎథిక్స్ కమిటీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేసి, ఆయన నుంచి రాతపూర్వక వివరణ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
కౌశిక్ రెడ్డి ఇచ్చే వివరణ ఆధారంగా ఎథిక్స్ కమిటీ తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన ఘటన రాజకీయంగా చర్చనీయాంశం కాగా, తాజా నోటీసులతో ఈ వ్యవహారం మరోసారి తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కౌశిక్ రెడ్డి ఏం సమాధానం చెబుతారు ? ఎథిక్స్ కమిటీ తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి ? అనే విషయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
