* సంక్షేమ పథకాలపై ప్రజలకు విశ్వాసం కలిగించాలి
* ఆరు గ్యారెంటీలను పారదర్శకంగా అమలు చేయాలి
* ఎవరికి వారు సమర్ధతను చాటుకోవాలి
* కలెక్టర్ల సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఇది ప్రజా ప్రభుత్వమని ప్రజల్లో విశ్వాసం కలిగించే బాధ్యత మీదేనని కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సూచించారు. ఆరు గ్యారెంటీ (Six guarantees) లను పారదర్శకంగా అమలు చేయాలని ఆదేశించారు. సచివాలయం (Secretariat) లో మంగళవారం కలెక్టర్ల సదస్సు (Collectors Conference) నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి (Shantikumari, Chief Secretary to Tealngana Government), అన్ని శాఖల కార్యదర్శులతో పాటు మంత్రులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గతంతో పోలిస్తే జిల్లాల పరిధి, జనాభా సంఖ్య తగ్గడంతో కలెక్టర్లు మరింత సమర్ధవంతంగా పనిచేయాలని అన్నారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకొని గృహ జ్యోతి (Gruha Jyoti), మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్ పథకాల (Mahalakshmi Gas Cylinder Schemes)కు అర్హులెవరికైనా ఈ పథకం వర్తించకపోతే.. తమ ఆధార్ (Aadhaar), రేషన్ కార్డు (Ration card), గ్యాస్ కనెక్షన్ నెంబర్ (Gas connection number), విద్యుత్ సర్వీస్ నంబర్లు (Electricity service numbers) సరిచేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని సీఎం(CM) గుర్తు చేశారు. అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో ప్రజా పాలన సేవా కేంద్రాలు (Public Administration Service Centres) పని చేసేలా చూడాలని, అవసరమైతే ప్రజావాణి జరిగే రోజున కలెక్టరేట్లలోనూ సేవాకేంద్రం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.
ధరణి సమస్యల పరిష్కారానికి డెడ్‌లైన్
కలెక్టర్ల సదస్సులో ధరణి దరఖాస్తులు (Dharani applications), సమస్యల పరిష్కారంపై చర్చించారు. ఆగస్టు 15లోగా పెండింగ్‌లో ఉన్న ధరణి దరఖాస్తుల (Pending Dharani applications) ను పరిష్కరించాలని ఆదేశించారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని సీఎం ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 64 లక్షల మంది సభ్యులున్నారని, కోటి మందిని సభ్యులుగా చేరేలా స్పెషల్ డ్రైవ్ (Special drive) నిర్వహించాలన్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీరిదిద్దాలనేది ప్రభుత్వ సంకల్పమని సీఎం ప్రకటించారు. కలెక్టర్లు అన్ని పనులను చక్కగా పూర్తి చేసి ఎవరికి వారు సమర్థతను చాటుకోవాలన్నారు. ఇది ప్రజా ప్రభుతమని.. ఇక్కడ అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలతో ప్రజలకు విశ్వాసం కల్పించే బాధ్యత మీనని కలెక్టర్లకు సీఎం మార్గదర్శనం చేశారు. కలెక్టరేట్లలో ప్రతివారం నిర్వహించే ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో సమస్యలు పరిష్కారమైతే, హైదరాబాద్‌లో ప్రజాభవన్‌కు వచ్చే అర్జీల సంఖ్య తగ్గిపోతుందని.. అదే మీ పనితీరుకు అద్దం పడుతుందన్నారు.
——————————