
సుబేదారి పోలీసుల తో నిందితుడు ఫ్రాన్సియా ఆడం
ఆకేరు న్యూస్ హన్మకొండ : యువతకు గంజాయిని విక్రయిస్తున్న వ్యక్తిని సుబేదారి పోలీసులు (Subedari Police) బుధవారం అరెస్టు చేశారు. నిందితుడి నుండి సుమారు ఒక లక్ష యాభై వేల రూపాయల (One lakh fifty thousand rupees) విలువ గల ఆరు కిలోల గంజాయి (Marijuana), ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు హనుమకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి (Devender Reddy) వివరాల ప్రకారం.. నిందితుడు కాజీపేట విష్ణుపురి కి చెందిన ఫ్రాన్సియా ఆడం (Francia Adam) కారు డ్రైవర్(Car driver) గా పని చేస్తూనే గంజాయి కి అలవాటు పడ్డాడు.. దీంతో నిందితుడు గంజాయికి వున్న విలువను గుర్తించి తాను కూడా గంజాయి అమ్మి డబ్బు సంపాదించాలనుకున్నాడు. ఇందుకోసం నిందితుడు గతంలో భద్రాచలంలో పరిచయం అయిన హుస్సేన్ అనే వ్యక్తి ద్వారా ఒడిషా నుండి గంజాయి ని తెప్పించుకొని ట్రై సిటీ (Tri City) లో గంజాయి అవసరమైన వ్యక్తులకు ఎక్కువ ధరకు విక్రయించేవాడు. ఇదే రీతిలో ఈ రోజు ఉదయం హంటర్ రోడ్డు (Hunter Road) లోని కోడెం ఫంక్షన్ హల్ (Codem Function Hull) వద్ద సుబేదారి పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానస్పదంగా కనిపించిన నిందితుడుని అదుపులోకి తీసుకొని విచారించగా నిందితుడి వద్ద గంజాయి బైటపడింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించి దర్యాప్తు చేపట్టారు. గంజాయి విక్రయదారుణ్ణి పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సుబేదారి ఇన్స్ స్పెక్టర్ సత్యనారాయణ రెడ్డి, ఎస్. ఐ గాలిబ్ తో ఇతర పోలీస్ సిబ్బంది ఏఎస్ఐ రాజయ్య, కానిస్టేబుల్ సత్యనారాయణ, ఆలీ, ప్రభాకర్ లను హనుమకొండ ఏసీపీ (ACP) అభినందించారు.
————————-