* జూబ్లీహిల్స్ లో డిపాజిట్ కోల్పోవడంతో బీజేపీ వివాదం
* రెండు టర్మ్ లు నేనే సీఎం : రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, డెస్క్ : తన వ్యాఖ్యలపై అనవసర వివాదం చేస్తున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Telangana Cm Revanthreddy) తెలిపారు. పార్టీలో భిన్న మనస్తత్వాలు ఉంటాయని చెపాలనుకున్నా అని వెల్లడించారు. డీసీసీ అధ్యక్షులు వయసులో చిన్నవారైనా పెద్ద బాధ్యతలో ఉన్నారనే ప్రయత్నం చేశానని వివరణ ఇచ్చారు. ఢిల్లీ టూర్ లో ఉన్న రేవంత్ మీడియాతో చిట్ చాట్ లో భాగంగా మాట్లాడారు. తెలంగాణలో మరోసారి కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందని, రెండు టెర్మ్ లు తానే సీఎం (Cm) అని ధీమాగా చెప్పారు. హిందూ దేవుళ్లపై వివాదాస్పదంగా మాట్లాడినట్లు ఎడిట్ చేసి ట్రోల్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే, ఉత్తర భారతదేశంలో కూడా తనను పాపులర్ చేస్తున్నందుకు బీజేపీకి థ్యాంక్స్ చెప్పారు. జూబ్లీహిల్స్ డిపాజిట్ కూడా కోల్పోవడంతో ఆ పార్టీ వివాదాస్పదం చేస్తోందన్నారు. పార్టీలో అంతర్గతంగా మాట్లాడిన వాటిని ఎడిట్ చేసి ప్రచారం చేస్తున్నారని అన్నారు. కాగా హిందూ దేవుళ్లపై రేవంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ గాంధీభవన్ (Gandhibhavan) ముట్టడికి బీజేపీ (bjp) యత్నించింది. లోనికి తోసుకెళ్లేందుకు ఆ పార్టీ కార్యకర్తలు ప్రయత్నించడంతో స్వల్ప తోపులాట జరిగింది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
