* వరుసగా కేంద్ర మంత్రులతో భేటీలు
* అధిష్ఠాన పెద్దలతో కూడా..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బంధువులకు చెందిన వివాహం నిమిత్తం రాజస్థాన్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి(Cm Revanthreddy).. ఈరోజు ఢిల్లీ(Delhi)కి చేరుకున్నారు. కాసేపట్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(Kishanreddy)తో భేటీ కానున్నారు. అలాగే.. రాత్రి 7 గంటలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తోను, ఆ తర్వాత రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ(Nithin Gadkary)తోను భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రాత్రికి ఏఐసీసీ(Aicc) పెద్దలతో రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. విజయోత్సవాల సందడిని వివరించనున్నారు. అలాగే ఎప్పటి నుంచో నానుతున్న మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే అవకాశం కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి తనకు అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి (Malreddy Rangareddy) అధిష్ఠాన పెద్దలకు లేఖలు రాశారు. మైనారిటీ కోటాలో మంత్రివర్గంలో చోటుకోసం హైదరాబాద్‌కే చెందిన ఫిరోజ్ ఖాన్ యత్నిస్తున్నారు. మరో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కూడా మంత్రివర్గంలో చోటు ఆశిస్తున్నారు. ఈరోజు అధిష్ఠాన పెద్దలతో భేటీలో దీనిపై కొలిక్కి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
……………………………..