
* భారత్ నుంచి చోటు సంపాదించిన తొలి రాష్ట్రం తెలంగాణ
ఆకేరు న్యూస్, డెస్క్ : జపాన్లో ఒసాకా ఇండస్ట్రియల్ ఎక్స్ పో(Osaka Industrial Expo)లో తెలంగాణ పెవిలియన్ ఏర్పాటు చేశారు. పెవిలియన్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఒసాకా ఎక్స్ పోలో పాల్గొన్న భారత్ (Bharath)లోని తొలి రాష్ట్రం తెలంగాణ కావడం గమనార్హం. తెలంగాణ ప్రత్యేకతలు చాటి చెప్పేలా ఎక్స్ పో వేదికపై ఏర్పాట్లు చేశారు. పారిశ్రామిక అనుకూలతలు, పర్యాటక ఆకర్షణలు తెలియజేసేలా ఏర్పాట్లు చేశారు. ఈ ఎక్స్ పోలో తెలంగాణ(Telangana)కు రెండు రోజుల పాటు అవకాశం లభించనుంది. తెలంగాణలోని పెట్టుబడి పెట్టే అవకాశాల గురించి భారత్ ప్రతినిధులు అక్కడి పారిశ్రామికవేత్తలకు తెలియజేయనున్నారు. ఇది రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావడంలో కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి.
…………………………………