* ఊట్నూర్ లో నమోదైన కేసులో ఎఫ్ఐఆర్ కొట్టివేత
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Ktr)కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆదిలాబాద్ జిల్లా ఊట్నూర్ పోలీస్ స్టేషన్ లో ఆయనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను ఉన్నత న్యాయ స్థానం కొట్టివేసింది. రాజకీయ ప్రేరేపిత కేసుగా భావిస్తూ ఎఫ్ఐఆర్ను కొట్టివేసింది. మూసీ ప్రాజెక్టు పేరుతో రూ.25 వేల కోట్ల నిధులను కాంగ్రెస్ పార్టీ తరలించిందంటూ కేటీఆర్ చేసిన ఆరోపణలతో తమ పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీశారంటూ ఆదిలాబాద్ (Adilabad)జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఆత్రం సుగుణ ఫిర్యాదు చేశారు. దీంతో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు పోలీసుస్టేషన్లో గత ఏడాది సెప్టెంబరు 30న కేసు నమోదైంది. ఈక్రమంలో కేసును కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు.. ఈ కేసు రాజకీయ ప్రేరేపిత కేసుగా భావించి తాజాగా ఎఫ్ఐఆర్(FIR)ను కొట్టివేసింది. ముఖ్యమంత్రి స్థాయిని తగ్గించేలా నిరాధారమైన ఆరోపణలు చేసిన కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని సుగుణ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్లు 352, 353(2), 356(2) కింద కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసును కొట్టివేస్తూ హైకోర్టు (HIGH COURT) తీర్పునిచ్చింది.
………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
