* 563 పోస్టులకు 31,383 మంది అభ్యర్థుల హాజరు
* ఒక్క నిమిషం నిబంధనతో కొందరు పరీక్షకు దూరం
* బేగంపేటలో గోడదూకిన అభ్యర్థి.. పోలీసుల అదుపులోకి
* అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
* సుప్రీంకోర్టులోనూ పరీక్షలకు లైన్ క్లియర్
* ఈ సమయంలో జోక్యం చేసుకోలేమని పేర్కొన్న ధర్మాసనం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఎట్టకేలకు ఉత్కంఠకు తెరపడింది. భారీ బందోబస్తు మధ్య తెలంగాణలో గ్రూప్ – 1(Group – 1) మెయిన్స్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి పరీక్ష ప్రారంభమైంది. ఈ పరీక్ష ప్రారంభానికి ముందే సుప్రీంకోర్టు (Suprim Court)కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అందరికీ బిగ్ రిలీఫ్ వచ్చిట్టు అయింది. ఈ సమయంలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. ఎలాంటి ఆందోళన లేకండా ఏకాగ్రతతో పరీక్షలు రాయాలని అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి(Cm Revanthreddy) సూచించారు.
2011 తర్వాత తెలంగాణలో మళ్లీ ఇప్పుడే గ్రూప్ 1 పరీక్షలు జరుగుతున్నాయి. 563 పోస్టులకుగాను 31,383 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. నేటి నుంచి 27వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఒక్క నిమిషంతో నిబంధనతో కొందరు పరీక్షకు దూరమయ్యారు. కోఠి ఉమెన్స్ కాలేజీలోని కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన యువతిని అధికారులు పరీక్షకు అనుమతించలేదు. దీంతో ఆమె తీవ్ర ఆవేదనకు గురైంది. బేగంపేటలో ఓ యువకుడిని అనుమతించకపోవడంతో గోడదూకి లోపలకు వెళ్లే ప్రయత్నం చేశాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
గ్రూపు – 1 అభ్యర్థులకు శుభాకాంక్షలు : రేవంత్ రెడ్డి
పరీక్ష రాస్తున్న గ్రూపు – 1 అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి ఆందోళనలూ లేకుండా ఏకాగ్రతతో పరీక్షలు రాయాలని సూచించారు. మెయిన్స్ పరీక్షలో విజయం సాధించి తెలంగాణ(Telangana) పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.. అని ట్విట్టర్ ద్వారా మెసేజ్ పంపారు. కాగా, తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష కోసం 46 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. జనరల్ ఇంగ్లిష్ తప్ప మిగతా పరీక్షలు నచ్చిన భాషలో రాసుకోవచ్చు. అన్నీ కూడా ఒకే భాషలో రాయాల్సి ఉంటుంది.
……………………………….