ఆకేరున్యూస్, హైదరాబాద్: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన రaరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయాన్ని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జిలు జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి, జస్టిస్ పి. శ్రీసుధ శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జడ్జిలకు ఆలయ రాజగోపురం వద్ద ఆలయ అర్చకులు మంత్రోచ్ఛారణ, మంగళ వాయిద్యాలు మధ్య పూర్ణకుంభంతో స్వాగతం పలకగా.. ప్రత్యేకపూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం జడ్జీలకు ఆలయ కార్యనిర్వాహణ అధికారి శివ రుద్రప్ప పూలమాల శాలువాతో సన్మానించి స్వామివారి ప్రసాదంతో పాటు చిత్రపటాన్ని అందజేశారు.
……………………………
