
* బోర్డు అధికారిక ప్రకటన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఇంటర్ ఫలితాల ప్రకటనకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు డేట్ ఫిక్స్ చేసింది. ఈ నెల 22న ఇంటర్ ఫలితాలను (Inter Results) ప్రకటిస్తామని అధికారులు పేర్కొన్నారు. మొదటి సంవత్సరం, సెకండియర్ ఫలితాలను ఒకేసారి ప్రకటించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ఫలితాలను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. విద్యార్థులు ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్సైట్ (tsbie.cgg.gov.in లేదా results.cgg.gov.in)లో చూసుకోవచ్చు. మార్చి 5 నుంచి 25 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1532 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 9,96,971 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 4.88 లక్షల మంది ఫస్టియర్ విద్యార్థులు ఉండగా, 5 లక్షలకుపైగా సెకండియర్ విద్యార్థులు ఉన్నారు. మార్చి 18 నుంచి సమాధాన పత్రాల మూల్యాంకనం చేశారు.
……………………………………………………