
* ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే
ఆకేరు న్యూస్ డెస్క్ : ఈ రోజు మొత్తం దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ( MALLIKARJUMA KHARGE ) అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దేశ వ్యాప్తంగా ప్రజలనుంచి కులగణన చేయాలని వస్తున్న ఒత్తిడి మేరకు ప్రధాని నరేంద్ర మోదీ విధిలేని పరిస్థితుల్లో కులగణనకు ఒప్పుకున్నారని ఖర్గే అన్నారు. తెలంగాణలో కులగణన చేసిన తరువాత దేశ వ్యాప్తంగా కులగణన చేయాలనే డిమాండ్ పెరిగిందని ఖర్గే పేర్కొన్నారు. తెలంగాణలో నిర్వహించిన సర్వే ప్రకారం స్థానిక సంస్థల్లో విద్యాసంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు సిఫారసు చేస్తోందని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం తో పాటు మంత్రివర్గ సహచరులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు రాష్ట్ర ప్రజలకు ఆయన కృతజ్ఞత తెలిపారు.దశాబ్దాలుగా అణచివేతకు గురవుతుననా పక్కకు నెట్టివేయబడిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల ప్రజల కోసమే కాంగ్రెస్ పనిచేస్తుందని ఖర్గే స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ( RAHUL GANDHI )దేశంలో సమసమాజ స్థాపన కోసం కృషి చేస్తున్నారని ఖర్గే వివరించారు. కేంద్ర విశ్వవిద్యాలయాల్లో బీసీ లు దళిత వర్గాలకు అన్యాయం జరుగుతోందని అన్నారు 80 శాతం ఓబీసీ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఖర్గే వివరించారు.
……………………………..