* రుణమాఫీలో తెలంగాణ రికార్డ్
* 11నెలల పాలనలో 22 వేల కోట్ల రుణమాఫీ
* రికార్డ్ స్థాయిలో ధాన్యం దిగుబడి
* మొట్టమొదటి సారిగా సన్నాలకు బోనస్
* ఉద్యోగాల భర్తీ వేగవంతం
* మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి…
ఆకేరు న్యూస్, కోదాడ: అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం పరుగులు పెడుతూ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం కోదాడ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలకు మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ… మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ఏడాది డిసెంబర్ 9న అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన శ్వేతపత్రం విడుదల చేసి వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించామన్నారు. 7 లక్షల కోట్ల అప్పు ఉన్నప్పటికీ ఆధైర్యపడకుండా ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తున్నామని.. రుణమాఫీ, ఉచిత విద్యుత్, సబ్సిడీ ఎరువులు, మద్దతు ధర, ఉపాధి హామీ పథకం లాంటి వాటితో రైతులను ఆదుకుంటున్నామన్నారు. భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని తేల్చి చెప్పారు. ప్రజలు అభివృద్ధిని మాత్రమే చూస్తున్నారని ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని పట్టించుకోవడం లేదన్నారు.
………………………………………..