
మాజీ మంత్రి మల్లారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి లపై భూ కబ్జా కేసు నమోదు.
* అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిపై కూడా
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మాజీ మంత్రి మల్లారెడ్డిపై (Mallareddy) పేట్‌బషీరాబాద్ పోలీసులు భూ కబ్జా కేసు నమోదు చేశారు. అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిపై (Marri Rajashekar Reddy) కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. తన స్థలంలో నిర్మాణాలను కూల్చివేశారని, కబ్జాకు యత్నించారని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. ఈమేరకు మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
————————