* రాష్ట్ర వ్యాప్తంగా 2,620 లైసెన్స్ దుకాణాలు
* పల్లెల్లో ఓట్ల పండగ.. ఫిబ్రవరిలో మేడారం జాతర
* అధికారికంగా కొత్త ఓనర్ల చేతికి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మద్యం షాప్‌లు మారనున్నాయి. నేటి నుంచి కొత్త ఓనర్ల చేతికి వెళ్లనున్నాయి. నూతన మద్యం అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఒక్కో దరఖాస్తు ధరను రూ.3 లక్షలకు పెంచడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖాజానాకు భారీ మొత్తంలో ఆదాయం సమకూరింది. కొత్త మద్యం షాపులు రెండేళ్ల పాటు ఉండనున్నాయి. కొత్త షాపులకు గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటు మేడారం జాతర ఉండడంతో ఈ సారీ భారీ స్థాయిలో మద్యం అమ్మకాలు ఉండనున్నాయి.
ఎన్నికలు, మేడారం జాతరతో పెరగనున్న అమ్మకాలు..
పల్లెల్లో ఓట్ల పండుగ నడుస్తోంది. దీంతో మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. ఎలక్షన్ల పుణ్యమా అమ్మకాలు రెట్టింపయ్యాయి. దీనికి తోడు చలికాలం కావడంతో మద్యం అమ్మకాలకు ఢోకా లేకుండా పోయింది. భాగంగా మద్యం దుకాణం లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే ఫీజును గతంలో ఉన్న రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచింది. ఈ పెంపు ప్రభుత్వానికి అదనపు ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. దీంతోపాటు మద్యం దుకాణదారులు చెల్లించాల్సిన వార్షిక లైసెన్స్ ఫీజును కూడా అమ్మకాల స్థాయి ఆధారంగా స్లాబ్‌లుగా విభజించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఒక్కో దుకాణానికి ప్రతి ఏటా అత్యధికంగా రూ.కోటి 10 లక్షల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అమ్మకాలను బట్టి రూ.1.10 కోట్లు, రూ.85 లక్షలు, రూ.56 లక్షలు, రూ.55 లక్షలు, రూ50 లక్షల స్లాబ్‌లను నిర్ణయించారు. అయితే లైసెన్స్‌దారులు చెల్లించాల్సిన లైసెన్స్ ఫీజులో ఆరో వంతును ఎక్సైజ్ శాఖ ఇప్పటికే వసూలు చేసింది. దీంతో ప్రభుత్వానికి కాసుల వర్షం కురిసింది.
మద్యం అమ్మకాలకు కలిసొచ్చే కాలం..
ఈ సారీ మద్యం అమ్మకాలకు కాలం కలిసొచ్చేదిగా ఉంది. పంచాయతీలలో ఓట్ల పండగ, మేడారం జాతరతో ఈ లక్ష్కీ ఛాన్స్ రానుంది. దీంతో ఈసారి వ్యాపారులకు కూడా పరిణామాలు లాభాలార్జించేలా కలిసివచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కొత్త పాలసీ కాలంలో గ్రామ పంచాయతీ, పరిషత్, మునిసిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. అంతేకాకుండా త్వరతో జరగబోయే మేడారం జాతర వంటి భారీ ఉత్సవాలు కూడా మద్యం అమ్మకాలు భారీగా పెరగడానికి కారణమవుతాయి. కొత్తగా లైసెన్స్ దక్కించుకున్న వ్యాపారులు సోమవారం నుంచి తమ దుకాణాలను కొత్త పాలసీ ప్రకారం అమ్మకాలు చేపట్టనున్నాయి.
…………………………………………………………………..
