Telangana POLYCET Counselling Schedule
* రేపటి నుంచే రిజిస్ట్రేషన్లు ప్రారంభం
* అభ్యర్థులకు కీలక మార్గదర్శకాలు
ఆకేరు న్యూస్, కమలాపూర్:
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కౌన్సెలింగ్ షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. పాలిసెట్ ద్వారా అడ్మిషన్లు పొందగోరే విద్యార్థులు మే 27 నుంచి మే 31 వరకు ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, హెల్ప్‌లైన్ సెంటర్లలో స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ మే 29 నుంచి జూన్ 1 వరకు కొనసాగుతుంది. విద్యార్థులు తమకు నచ్చిన ఆప్షన్లను ఎంచుకున్న తర్వాత, జూన్ 3న ఆప్షన్లు ఫ్రీజ్ చేయబడతాయి. తొలి విడత సీట్ల కేటాయింపు జూన్ 6న జరుగుతుంది. సీటు పొందిన విద్యార్థులు జూన్ 6 నుంచి 9 మధ్య ఆన్లైన్లో ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. అయితే, జూన్ 8 , 9 తేదీల్లో సంబంధిత కాలేజీలో ఫిజికల్ రిపోర్టింగ్ చేయడం తప్పనిసరి, లేనిపక్షంలో కేటాయించిన సీటు రద్దు చేయబడుతుంది. రిపోర్టింగ్ సమయంలో ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (TC) మరియు ఇతర ధృవపత్రాల జిరాక్స్ కాపీలను సమర్పించాల్సి ఉంటుంది.
మొదటి విడతలో పాల్గొనని వారి కోసం జూన్ 15న ఫైనల్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. వీరికి జూన్ 16న సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించి, జూన్ 20న సీట్లను కేటాయిస్తారు. ఫైనల్ ఫేజ్ అభ్యర్థులు జూన్ 22, 23 తేదీలలో కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి. అనంతరం, ఒకే కాలేజీలో ఇతర బ్రాంచ్‌లకు మారాలనుకునే వారి కోసం జూన్ 27, 28 తేదీల్లో సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ అవకాశం కల్పిస్తారు. దీనికి సంబంధించిన కొత్త అలాట్మెంట్లు జూన్ 30న విడుదలవుతాయి. ఇంటర్నల్ స్లైడింగ్ ప్రక్రియ తర్వాత అడ్మిషన్ రద్దు చేసుకోవడానికి లేదా డ్రాపౌట్ అవ్వడానికి వీలుండదని అధికారులు స్పష్టం చేశారు.
చివరగా మిగిలిపోయిన సీట్ల భర్తీ కోసం జూలై 1న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల చేసి, జూలై 8 నాటికి పూర్తి ప్రక్రియను ముగిస్తారు. అభ్యర్థులు ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ https://tgpolycet.nic.in ను సందర్శించాలని లేదా ఏవైనా సందేహాలు ఉంటే సమీప హెల్ప్‌లైన్ సెంటర్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
