CNG Prices Hike India
ఆకేరు న్యూస్, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సామాన్య, మధ్యతరగతి వాహనదారులకు ఇంధన ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు, ఇంధన సరఫరాలో వస్తున్న మార్పుల ప్రభావం దేశీయ మార్కెట్‌పై తీవ్రంగా పడుతోంది. నిన్న (సోమవారం) పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగిన మరుసటి రోజే.. గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) ధరలను పెంచుతూ వాహనదారులకు మరో గట్టి షాక్ ఇచ్చారు.
తాజా సవరణ ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీ మరియు పరిసర ప్రాంతాలలో (NCR) కిలో CNG ధరపై రూ. 2 పెరిగింది. ఈ పెంపుతో న్యూఢిల్లీలో కిలో CNG ధర రూ. 83.09 కి చేరుకుంది. పెరిగిన ఈ నూతన ధరలు నేటి (మే 26) ఉదయం 6 గంటల నుంచే అమలులోకి వచ్చాయి.
*11 రోజుల్లో 4వ సారి పెంపు..
గడచిన 11 రోజుల్లో CNG ధరలు పెరగడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. మే 15 నుంచి ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (IGL) ధరల సవరణను ప్రారంభించింది. మే 15న రూ. 2, మే 17న రూ. 1, మే 23న రూ. 1.. చొప్పున పెంచుకుంటూ వచ్చి, తాజాగా ఈరోజు మరో రూ. 2 పెంచడంతో కేవలం ఈ 11 రోజుల్లోనే కిలో CNGపై ఏకంగా రూ. 6 మేర భారం పడింది.
ప్రధాన నగరాల్లో తాజా CNG ధరలు (కిలోగ్రాముకు):
ఢిల్లీ: రూ. 83.09
నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘాజియాబాద్: రూ. 91.70
గురుగ్రామ్: రూ. 88.12
ముంబై: రూ. 84.00
*నిన్న పెట్రోల్, డీజిల్.. నేడు CNG!
పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) దేశాలలో నెలకొన్న ఉద్రిక్తతలు మరియు ఇరాన్ యుద్ధ ప్రభావం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరా గొలుసు (Supply Chain) దెబ్బతింది. దీంతో చమురు సంస్థలు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటూ.. ఆ భారాన్ని వినియోగదారులపైకి నెడుతున్నాయి. నిన్ననే (మే 25న) చమురు సంస్థలు పెట్రోల్‌పై రూ. 2.61, డీజిల్‌పై రూ. 2.71 మేర భారీగా ధరలను పెంచాయి. తాజా పెంపుతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.12 కి, డీజిల్ ధర రూ. 95.20 కి చేరి మే 2022 తర్వాత అత్యంత గరిష్ట స్థాయిలను తాకాయి. తెలుగు రాష్ట్రాల్లో (హైదరాబాద్‌లో) పెట్రోల్ ధర ఏకంగా రూ. 115.73 గా కొనసాగుతోంది.
*రవాణా రంగం విలవిల.. పెరగనున్న నిత్యావసరాల ధరలు
పెట్రోల్, డీజిల్ ధరల భారంతో ప్రత్యామ్నాయంగా CNG వాహనాలను నమ్ముకున్న ఆటో, క్యాబ్ డ్రైవర్లు, లాజిస్టిక్స్ ఆపరేటర్లు ఈ తాజా నిర్ణయంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుస ధరల పెంపుతో ప్రజా రవాణా ఛార్జీలు, క్యాబ్ రేట్లు పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాకుండా రవాణా ఖర్చులు పెరగడం వల్ల మార్కెట్లో కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు కూడా మరింత ప్రియమ్యే ప్రమాదం ఉందని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
