Southwest Monsoon Telangana rain Update
* రెండు, మూడు రోజుల్లో రాష్ట్ర ములో నైరుతి రూతుపవనలు
అకేరు న్యూస్, హన్మకొండ: తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
2026 జూన్ 5 నాటి పరిస్థితుల ప్రకారం నైరుతి రుతుపవనాల ఉత్తర పరిమితి (Northern Limit of Monsoon – NLM) , మంగళూరు, ఉదగమండలం (ఊటీ), కొడైకెనాల్, తూత్తుకుడి, గుండా కొనసాగుతోంది.
రాగల 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని భాగాలు, గోవా రాష్ట్రం మొత్తం, మహారాష్ట్ర,ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని మిగిలిన భాగాలు, నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ-మధ్య, తూర్పు-మధ్య ఈశాన్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, అలాగే ఈశాన్య రాష్ట్రాలలోని కొన్ని భాగాలలోకి మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.
మరాఠ్వాడా నుండి కొంకణ్ & గోవా మీదుగా నైరుతి అరేబియా సముద్రం వరకు సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ద్రోణి (trough) బలహీనపడింది.
దక్షిణ తెలంగాణ దానిని ఆనుకుని ఉన్న తీరప్రాంత ఆంధ్రప్రదేశ్ & యానాం పరిసరాల్లో సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం (cyclonic circulation) ఈరోజు ఉదయం 05:30 గంటల సమయానికి బలహీనపడింది.
* రాగల 3 రోజులకు వాతావరణ సూచన
ఈరోజు,రేపు ఎల్లుండి రాష్ట్రంలోని చాలా జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు రానున్న నాలుగు రోజులలో క్రమంగా రెండు నుండి మూడు డిగ్రీలు తగ్గే అవకాశం ఉంది.
* వాతావరణ హెచ్చరికలు
ఈరోజు రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
నేడు రేపు ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు మరియు 40 నుండి 50 కి.మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
