* ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా కొనుగోలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు సంస్థలో మరో 448 అద్దె బస్సలు రానున్నాయి. ఈ బస్సులను ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా కొనుగోలు చేయనున్నారు. ఈ పథకంలో ఇప్పటికే 152 బస్సులు అద్దె ప్రాతిపదికన నడుస్తున్నాయి. మహిళలను కోటీశ్వరులను చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ పెద్దపీఠ వేస్తోంది. ఇందిరా మహిళా శక్తి పథకంతో కొనుగోలు చేసిన బస్సులను ఆర్టీసీలో అద్దెకు ఇస్తారు. ఇందుకు గాను ఆర్టీసీ మహిళా సంఘాలకు నెలా నెలా డబ్బులు చెల్లింస్తోంది. మహిళా సంఘాలకు ఆర్థిక స్వావలంబన చేకూరుతోంది. బస్సుల కొనుగోలుకు సంబంధించి సెర్ప్ సంస్థ సీఈవో దివ్యా దేవరాజన్ సంస్థ ఎండీ నాగిరెడ్డికి లేఖ రాశారు. మహిళా సంఘాల ఈ బస్సులను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ అనుమతులు పూర్తయిన వెంటనే బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీకి అప్పగిస్తామని సెర్ప్ సీఈవో తెలిపారు. ఇప్పటికే ఉన్న 152 బస్సులకు ఈ బస్సులు తోడైతే.. మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడిచే బస్సుల సంఖ్య 600కు చేరుతోంది.
……………………………………
