Telangana Startup Challenge
* ఆలోచనలకు ఇదే వేదిక
* నవంబర్ 20 చివరి తేదీ
ఆకేరు న్యూస్, డెస్క్: తెలంగాణలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడంతో పాటు రాష్ట్ర సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను కనుగొనే లక్ష్యంతో ప్రభుత్వం కీలక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 సందర్భంగా *తెలంగాణ ఇన్నోవేషన్ స్టార్టప్ ఛాలెంజ్ (TISC)*ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
రాష్ట్ర అభివృద్ధిలో యువత, స్టార్టప్ సంస్థలు, ఆవిష్కర్తలను భాగస్వాములను చేయడమే ఈ ఛాలెంజ్ ప్రధాన ఉద్దేశం. తెలంగాణ ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు వినూత్న ఆలోచనలతో పరిష్కారాలు చూపించాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా, రాష్ట్ర భవిష్యత్తును నిర్మించడంలో ప్రతి ఒక్కరికీ భాగస్వామ్యం కల్పించే వేదికగా TISCను రూపొందించింది.
ఆవిష్కర్తలకు ప్రభుత్వం ఆహ్వానం
రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే కొత్త ఆలోచనలు ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచించింది. తెలంగాణలోని సమస్యలను గుర్తించి వాటికి సరికొత్త పరిష్కారాలను ప్రతిపాదించాలని కోరింది. ఆవిష్కరణల ద్వారా కొత్త అవకాశాలను సృష్టించి, రాష్ట్రాన్ని మరింత మెరుగైన నివాసయోగ్య ప్రాంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పేర్కొంది.
నవంబర్ 20 వరకు దరఖాస్తులు
తెలంగాణ ఇన్నోవేషన్ స్టార్టప్ ఛాలెంజ్లో పాల్గొనాలనుకునే ఆసక్తిగల ఆవిష్కర్తలు, స్టార్టప్ ప్రతినిధులు నవంబర్ 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులు, ఇతర వివరాల కోసం ప్రభుత్వం ప్రత్యేక వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
దరఖాస్తు వెబ్సైట్: https://tisc.telangana.gov.in
రాష్ట్ర సమస్యలకు పరిష్కారాలు చూపే ఆలోచనలతో ముందుకు రావాలని, అందరూ కలిసి భవిష్యత్తు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

