సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరున్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పోరేషన్ల ఎన్నికలకు నేటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిపోనుంది. దీంతో పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల తరఫున రేపటి నుంచి సీఎం రేవంత్రెడ్డి జిల్లాల పర్యటనల్లో పాల్గొంటారని.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నుంచి ఎన్నికల ప్రచార సభలను ప్రారంభించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అమెరికా నుంచి తిరిగి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే రెండు సార్లు జూమ్ మీటింగుల్లో పాల్గొన్నారు.
జిల్లాల పర్యటన..
ఫిబ్రవరి 4వ తేదీ – మిర్యాలగూడ, 5వ తేదీ – చొప్పదండి, 6వ తేదీ – నిజామాబాద్ రూరల్, 7వ తేదీ — పరిగి, 8వ తేదీ – భూపాల్పల్లి, 9న మెదక్లో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో సీఎం పాల్గొంటారు.
………………………………………..
