* వ్యవసాయం మరియు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్గా కోదండ రెడ్డి
* బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్
* ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఎట్టకేలకు విద్యా కమిషన్ చైర్మన్ గా రిటైర్డ్ ఐఏయస్ ఆకునూరి మురళి ని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. అదే విదంగా వ్యవసాయం మరియు రైతు సంక్షేమ కమిషన్ ఏర్పాటు చేస్తూ దానికి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కోదండ రెడ్డి నియమించింది. బీసీ కమిషన్ చైర్మన్గా నిరంజన్ ను నియమించింది. సభ్యులుగా రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. బీసీ కమిషన్లో మెంబర్ సెక్రటరీగా బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ వ్యవహరిస్తారు..
——————————————–