ఆకేరు న్యూస్, హనుమకొండ : హనుమకొండలోని రామ్‌నగర్‌లో మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయపాత్రకు ఇవ్వొద్దని మధ్యాహ్న భోజన పథకం కార్మికులు మంత్రి కొండా సురేఖ ఇంటిని సోమవారం ముట్టడించారు. వెంటనే 8 నెలల పెండింగ్ బిల్లలు ఇవ్వాలని, కార్మికుల సమస్యలనుపరిష్కరించాలని నినాదాలు చేశారు. మంత్రిఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేయగా, సుబేదారి పోలీసులు వారిని అడ్డుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
………………………………………………
