ఆకేరు న్యూస్ డెస్క్ : తెలంగాణలో బెట్టింగ్ యాప్ కేసు సంచలనం సృష్టిస్తోంది. ఈ యాప్‌లను ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఫోకస్ చేసింది. మొత్తం 29 మందిపై ఈడీ ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR) నమోదు చేసింది. పలు రకాల ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లకు రానా ప్రమోట్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో తాజాగా టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati) హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. గత ఐదేళ్ల బ్యాంక్ స్టేట్మెంట్లను సమర్పించారు. జంగిల్ రమ్మీ అనే బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేసిన ఆరోపణలపై ఈడీ అధికారులు ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ఈడీ ఈ కేసులో మనీలాండరింగ్ జరిగిందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తోంది. బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకులు హవాలా ద్వారా డబ్బు తరలించారా? సెలబ్రిటీలకు రెమ్యునరేషన్ ఎలా చెల్లించారనే విషయాలపై ఈడీ లోతుగా విచారణ చేస్తోంది. పంజాగుట్ట, మియాపూర్, సూర్యాపేట, విశాఖలో నమోదైన ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈ విచారణ కొనసాగుతోంది. ఈ యాప్‌ల వల్ల అనేక మంది డబ్బు పోగొట్టుకోవడమే కాక, కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విచారణల నేపథ్యంలో త్వరలో ఈ కేసు గురించి మరిన్ని విషయాలు వెలుగులోకి రానున్నాయి.
……………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
