* రాష్ట్ర హోదా కావాలని రోడ్డెక్కిన జనం
* ఆందోళనకారులపై పోలీసుల లాఠీచార్జి
ఆకేరు న్యూస్ : కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాఖ్ లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
గత కొద్ది రోజులు లద్దాఖ్కు రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ బలంగా విన్పిస్తోంది. రాష్ట్ర హోదాతో పాటు రాజ్యాంగ రక్షణలు కల్పించాలని కోరుతూ మేధావులు విద్యార్థులు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నారు. బుధవారం ఈ ఆందోళన తారా స్థాయికి చేరింది. లద్దాఖ్ రాజధాని లేహ్ లో విద్యార్థులు రోడ్లపై కి వచ్చి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.దీంతో రాజధానిలో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. నిరసనకారులు ఆవేశంతో పోలీస్ వాహనాన్ని దగ్ధం చేశారు. విద్యార్థులకు మద్దతుగా స్థానికులు ఇతర ప్రజా సంఘాల నాయకులు రోడ్డెక్కారు. కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు నిరసన కారులపై లాఠీచార్జి చేశారు.
……………………………………………………
